వాల్‌నట్స్‌తో ఇన్ని లాభాలా?

మార్కెట్‌లో మనకు లభించే వాల్‌నట్స్‌ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటినే ఆక్రోట్స్‌ అని కూడా పిలుస్తారు.

By అంజి  Published on  12 Feb 2025 12:14 PM IST
Health benefits, walnuts, Lifestyle

వాల్‌నట్స్‌తో ఇన్ని లాభాలా?

మార్కెట్‌లో మనకు లభించే వాల్‌నట్స్‌ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటినే ఆక్రోట్స్‌ అని కూడా పిలుస్తారు. వీటి ధర కాస్త ఎక్కువైనా సరే అవకాశం ఉంటే తినడం హెల్త్‌కు చాలా మంచిది. వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, విటమిన్‌ బీ6, ఈ, ప్రోటీన్‌, రాగి, సెలీనియం, ఒమేగా - 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాల్‌నట్స్‌ ఎక్కువగా తింటే మెదడు పనితీరు మెరుగుపడి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అల్జీమర్స్‌ వచ్చే అవకాశం తగ్గుతుంది.

వాల్‌నట్స్‌లో ఉండే కాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్‌, ఐరన్‌ వల్ల రక్తహీనత తగ్గుతుంది. వాల్‌నట్స్‌లో ఫైబర్‌ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి కడుపు నిండుగా ఉందన్న భావన కలిగిస్తుంది. అందువల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి తింటే ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు క్రమంగా తగ్గుతాయి. వీటిలో ఉండే ఓమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.

Next Story