రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా?.. తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు
ఖర్జూరంలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
By అంజి Published on 10 March 2025 10:39 AM IST
రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా?.. తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు
ఖర్జూరంలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరాల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, పాస్ఫరస్‌లు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మనకు వివిధ వ్యాధులు ముప్పును తగ్గిస్తాయి. ఖర్జూరంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. దీనిలో మెగ్నీషియం, కాల్షియం, పాస్ఫరస్ ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. ఖర్జూరలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. దీనిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ ఖర్జూరం తినడం వల్ల కొవ్వు, రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రోస్టేట్ గ్రంథి, యూరినరీ సమస్యలతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్న వారు రోజూ ఖర్జూరాలు తింటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్జూరాల వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ రోజూ ఎక్కువ పరిమాణంలో వీటిని తినకూడదు. రోజూ రెండు ఖర్జూరాలను పరగడుపున తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. లావు తక్కువ ఉండి.. బరువు పెరగాలనుకునేవారు రోజూ నాలుగు తినాలని నిపుణులు చెబుతున్నారు.