ఒకప్పుడు గుమ్మడికాయతో చేసిన కూరలను, ఇతర పదార్థాలను ఎంతో ఇష్టంగా తినేవారు. అయితే ఇప్పుడు వాటితో తయారు చేసే కూరలను ఇతర పదార్థాలను తినడానికి చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. కానీ గుమ్మడి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుమ్మడిని ఆహారంగా తీసుకోని వారు కనీసం వాటి గింజలైనా ప్రతి రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
గుమ్మడి గింజల్లో ఫైబర్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ మేలు చేస్తాయి. గుమ్మడి విత్తనాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు తగ్గుతుంది. స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే పురుషుల లైంగిక ఆరోగ్యానికి గుమ్మడి గింజలు చాలా మేలు చేస్తాయి. ఇవి తీసుకుంటే వీర్యకణాల నాణ్యత పెరుగుతుంది. పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా గుమ్మడి గింజలు తగ్గిస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.