రోజూ స్విమ్మింగ్‌తో కలిగే ప్రయోజనాలు

ఆరోగ్యం కోసం ప్రతి రోజూ అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటాం. అయితే వీటికి బదులు అవకాశం ఉంటే స్విమ్మింగ్‌ చేస్తే శరీరం మరింత ఫిట్‌గా ఉంటుందంటున్నారు నిపుణులు.

By అంజి  Published on  10 Feb 2025 10:27 AM IST
health benefits, daily swimming, Life Style

రోజూ స్విమ్మింగ్‌తో కలిగే ప్రయోజనాలు

ఆరోగ్యం కోసం ప్రతి రోజూ అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటాం. అయితే వీటికి బదులు అవకాశం ఉంటే స్విమ్మింగ్‌ చేస్తే శరీరం మరింత ఫిట్‌గా ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే స్విమ్మింగ్‌ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

రోజూ ఉదయం కాసేపు స్విమ్మింంగ్‌ చేయడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఖర్చు అయ్యి కొవ్వు తొలగిపోతుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ బరువు ఉన్న వారు తగ్గే అవకాశమూ ఉంటుంది. పైగా ఎముకలు బలంగా తయారవుతాయి.

రోజూ ఈత కొట్టే వారికి గుండె సమస్యలు వచ్చే ముప్పు తక్కువ అని పలు అధ్యయనాల్లో తేలింది. ఈత వల్ల కండరాలు బలంగా మారి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు పెరుగుతుంది.

నిద్రలేమితో బాధపడేవారు రోజూ కాసేపు స్విమ్మింగ్‌ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

రోజూ ఈత కొట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గుతాయి. మానసిక సమస్యల నుంచి బయటపడొచ్చు. అందుకే అవకాశం ఉంటే రోజూ కాసేపు స్విమ్మింగ్‌ చేయండి.

Next Story