డెంగీ, టపాయిడ్ వస్తే శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. వీటి సంఖ్యను పెంచడంలో కివి, బొప్పాయి, కొబ్బరి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని డాక్టరు సూచన ప్రకారం.. తగిన మోతాదులో తీసుకోవాలి. వీటి ఉపయోగాలు ఏంటో చూద్దాం..
కివి పండు: కివి పండులో విటమిన్ సి,ఇ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి డెంగ్యూ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆస్తమాతో బాధపడే డెంగ్యూ రోగులు కివిని తింటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది.
కొబ్బరినీళ్లు: కొబ్బరి నీళ్లలో శరీరానికి తక్షణ శక్తిని అందించే అనేక పోషకాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. కొబ్బరి నీళ్లలో విటమిన్ బి,సి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్‌తో పాటు సోడియం, కాపర్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
బొప్పాయి: డెంగ్యూ జ్వరం చికిత్సలో బొప్పాయి పండు, ఆకు రసం ఉపయోగిస్తారు. ఇవి రెండు డెంగ్యూ సోకిన వ్యక్తిలో న్యూట్రోఫిల్స్, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లను పెంచడంలో సహాయపడతాయని పరిశోధనలో తేలింది. డెంగ్యూ రోగులు బొప్పాయి పండును, ఆకుల రసాన్ని డాక్టర్ సూచనల మేరకు తీసుకోవాలి.