రోజ్ వాటర్‌ను అందం కోసం, పరిమళం కోసం వాడతారని అందరికీ తెలుసు. కానీ దీని వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే..
రోజ్ వాటర్ పీహెచ్ స్థాయిలని సమన్వయం చేసి నేచురల్ టోనర్‌గా పని చేస్తుంది. చర్మానికి తేమను అందించడంతో పాటు, చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది.
దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. దద్దుర్లు, దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఎండ తీవ్రత నుంచి చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. ఎండలోకి వెళ్లేముందు రాసుకుని వెళ్తే చర్మం కమిలిపోకుండా ఉంటుంది. అలాగే కాస్త ముల్తానీ మట్టికి రోజ్ వాటర్‌ను కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం శుభ్రపడుతుంది.
చెంచా గులాబీ నీటిని కప్పు నీటిలో కలిపి తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్‌లో ముంచిన వస్త్రాన్ని నుదిటిపై పెట్టుకుంటే మైగ్రేన్, తలనొప్పిని తగ్గిస్తుంది.
జుట్టుకు రోజ్ వాటర్‌ను స్ప్రే చేయడం వల్ల జిడ్డు, చుండు తగ్గుతుంది. జుట్టు తేమగా, మృదువుగా మార్చడంతో పాటు మాడును ఆరోగ్యంగా ఉంచి జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.