ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు మంచినీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండి తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే సగం నిమ్మపండుకంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మకు బరువు తగ్గించే గుణం ఉంది కదా అని దానిని ఎక్కువ వాడితే ఎసిడిటీ వృద్ధి చెందుతుంది. అది చేసే అసలు పనికి ఆటంకం ఏర్పడుతుంది.
నిమ్మలో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమూ జలుబు, ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది. అలాగే ఉదయం గోరు వెచ్చని నీటితో నిమ్మరసం తీసుకుంటే ఉబ్బరం, ఛాతిలో మంట తగ్గుతుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగి.. రోజూ కొంత సమయం వ్యాయామం చేస్తే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది.