ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు (హైబీపీ) ఒకటి. దీనిని సైలెంట్ కిల్లర్‌గానూ పిలుస్తారు. దీని వల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యను నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో అర నిమ్మ చెక్క రసాన్ని పిండి రోజూ పరగడుపునే తాగాలి. నిమ్మరసం రక్త నాళాల్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని వల్ల అధిక రక్తపోటు నుంచి బయటపడవచ్చు.
కొబ్బరి నీళ్లను తాగడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఈ నీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో తోడ్పడతాయని ఓ అధ్యయనంలో తేలింది.
ఉల్లిపాయలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ చిన్న ఉల్లిపాయ ముక్కను తినడం మంచిది.
రెండు చెంచాల మెంతులను నీటిలో వేసి మరిగించాలి. చల్లారాక ఆ నీటిని వడగట్టి తాగాలి. మెంతుల్లో ఎక్కువగా ఉండే పొటాషియం, ఫైబర్ అధిక రక్తపోటు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రోజుకు రెండు అరటి పండ్లను తినడం, కూరల్లో ఉప్పు తగ్గించడం, ప్రతి రోజూ వ్యాయామం చేయడం వంటివి అధిక రక్తపోటును తగ్గించడంలో సాయపడతాయి.
పైన చెప్పిన సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుని డాక్టరు సలహాలు పాటిస్తే హైబీపీ ముప్పు నుంచి బయటపడవచ్చు.