రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి పూర్తిగా రాకముందే ఉక్కపోత పెరిగిపోయింది. దీంతో అందరూ ఏసీల చెంతకు చేరుతున్నారు. అయితే ఏడాదంతా పక్కన పెట్టిన ఏసీని మళ్లీ వాడేముందు ఒకసారి చెక్ చేయించడం, అలాగే ఏసీ చక్కగా పని చేయాలంటే మెయింటెనెన్స్ సరిగా చేయడం అవసరం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎండలు మండించే దాకా వేచి ఉండకుండా ఏసీ కండిషన్‌లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అవసరం అయితే ఏసీ గ్యాస్ పట్టించాలి. నెలకోసారి ఎయిర్ ఫిల్టర్‌లను చెక్ చేసుకోవాలి. ఇది ఎయిర్ కండీషనర్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన గాలి తగిలేలా చూసుకోవాలి.
కండెన్సర్ యూనిట్ చుట్టూ 4 అడుగుల ఖాళీ ప్లేస్ వదలాలి. గదిలో ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచేలా జాగ్రత్త పడాలి. అంతేకాదు ఏసీ బిల్లు తడిచి మోపెడు కాకుండా ఉండాలంటే అవసరం లేనపుడు ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంట్లో కిటికీలకు విండో ఫిల్మ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వేసవిలో ఇది మీ ఇంటిని చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది.