కౌగిలింత వల్ల బోలెడు లాభాలు
ప్రేమతో ఒకరిని కౌగిలించుకోవడం అనేది మాటల్లో వ్యక్తపరచలేనిది. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో 'కార్టిసోల్ స్టెరాయిడ్' స్థాయిలు
By అంజి Published on 9 Jun 2023 8:30 AM GMTకౌగిలింత వల్ల బోలెడు లాభాలు
ప్రేమతో ఒకరిని కౌగిలించుకోవడం అనేది మాటల్లో వ్యక్తపరచలేనిది. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో 'కార్టిసోల్ స్టెరాయిడ్' స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఒత్తిడి మరింత అధికం అవుతుంది. అలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఓ కౌగిలింత కావాల్సిందే అంటున్నారు నిపుణులు. వాటి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- ఒత్తిడి ఉన్నప్పుడు నచ్చిన వ్యక్తులను కౌగిలించుకుంటే.. కార్టిసోల్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ఒత్తిడీ తగ్గుతుంది.
- కౌగిలింతతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఆక్సిటోసిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మెదడుకు, మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
- భయాన్ని తొలగించి సురక్షితంగా ఉన్నాము. ఒంటరిగా లేము.. ప్రేమించేవాళ్లూ ఉన్నారని ఒక్క కౌగిలింత తెలుపుతుంది.
- కౌగిలింత ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపర్చి బిగుసుకున్న కండరాలను వదులు చేస్తుంది.
- ఇష్టమైన వ్యక్తులను కౌగిలించుకుంటే.. శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య పెరిగి రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
- కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని సంతోషాన్ని కౌగిలింతతో వ్యక్తపర్చొచ్చు. అలా బంధాలు మరింత దృఢంగా మారుతాయి.
- హగ్ ఒక నాన్-వెర్బల్ కమ్యూనికేషన్. నోటి మాటలు అందించలేని మద్దతు, సౌకర్యం, ఓదార్పు, ప్రేమ, భరోసాని హగ్స్ అందించగలవు.
- కుంగి కృశించిపోకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తికి రోజుకు 4 కౌగిలింతలు అవసరమని సైకాలజిస్టులు అంటున్నారు.