కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పాలిపోకుండా, ముడతలు పడకుండా కాపాడుతుంది. కీవీ పండు తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మెదడు చక్కగా పని చేసేలా చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ కె, విటమిన్ డి లు మానసిక స్థితిని నియంత్రిస్తాయి. గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కె సాయపడుతుంది. కివీ తింటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా సాగుతుంది.
ఆహారం సమర్థంగా విచ్ఛిన్నమవ్వడానికి ఇది సహాయపడుతుంది. కివీ పండ్లలో ఉండే పోటాషియం మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడి, కిడ్నీళ్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. కివీ పండులో విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వివిధ అనారోగ్యాల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. కివీ పండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేగాక రక్తపోటు కారణంగా వచ్చే పక్షవాతం, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.