Car Mileage Tips: ఈ ఐదు టిప్స్‌ ఫాలో అయితే మీ కారు మంచి మైలేజీ ఇస్తుంది..!

కారు మంచి మైలేజీ రాకపోతే కలత చెందుతారు. కానీ కొన్ని చిన్న విషయాలు పాటిస్తే.. కారు మైలేజ్ సులభంగా మెరుగుపడుతుంది.

By Medi Samrat  Published on  16 May 2024 3:25 AM GMT
Car Mileage Tips: ఈ ఐదు టిప్స్‌ ఫాలో అయితే మీ కారు మంచి మైలేజీ ఇస్తుంది..!

కారు మంచి మైలేజీ రాకపోతే కలత చెందుతారు. కానీ కొన్ని చిన్న విషయాలు పాటిస్తే.. కారు మైలేజ్ సులభంగా మెరుగుపడుతుంది. ఈ వార్తలో మేము మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాము.

మీరు మీ కారు నుండి మెరుగైన మైలేజీ పొందాలనుకుంటే.. మీరు ఎల్లప్పుడూ సమయానికి స‌ర్వీసింగ్‌ పూర్తి చేయాలి. వాహన స‌ర్వీసింగ్‌ ఆలస్యంగా చేస్తే.. ఇంజిన్ ఆయిల్ పాడైపోతుంది. దీంతో ఆయిల్ ఫిల్టర్ మూసుకుపోతుంది. దీని కారణంగా మైలేజ్ తగ్గుతుంది. కారు స్పేర్ పార్ట్స్ కూడా పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

మెరుగైన మైలేజ్ కోసం కారును వేగంగా డ్రైవింగ్ చేయకూడ‌దు. వాహనం అధిక వేగంతో నడపితే.. ఇంజిన్ అధిక సామర్థ్యంతో పని చేస్తుంది, దీని కారణంగా ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది.

కారు టైర్లలో గాలి స‌రిగా ఉండాలి. ఇది కూడా మైలేజీ కార‌ణ‌మ‌వుతుంది. టైర్‌లో గాలి తక్కువగా ఉంటే వాహనం పికప్ తగ్గుతుంది. దీంతో యాక్సిలరేటర్‌ను గట్టిగా తొక్కాల్సివ‌స్తుంది. దీంతో ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. దీని కారణంగా మైలేజీ తగ్గుతుంది.

చాలా మంది తమ కారును మొబైల్ హోమ్‌లా వాడుతారు. అన‌వ‌స‌ర‌పు వస్తువులను కూడా కారులో ఉంచుతారు. దీని కార‌ణంగా కారు బరువు పెరుగుతుంది. ఇది మైలేజీని తగ్గిస్తుంది. అందుకే అన‌వ‌స‌ర‌పు వ‌స్తువుల‌ను కారులో ఉంచ‌కండి.

మీ కారు మెరుగైన మైలేజ్ రావాలంటే.. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మ్యాప్‌ని ఉపయోగించండి. మీ గమ్యాన్ని చేరుకోవడానికి తక్కువ ట్రాఫిక్ ఉన్న మార్గాన్ని ఎంచుకోండి. మ్యాప్‌ని ఉపయోగించడం వల్ల ర‌ద్దీ లేని ర‌హ‌దారిలో ప్ర‌యాణించ‌వ‌చ్చు. అలాగే పెట్రోల్, డీజిల్ కూడా ఆదా అవుతుంది.

Next Story