నిమ్మరసంలో ఇవి కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

నిమ్మకాయ షర్బత్‌.. ఇది తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎండాకాలంలో చాలా మంది ఈ షర్బత్‌ తాగడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తారు.

By అంజి
Published on : 24 March 2025 10:58 AM IST

Drinking, lemon juice, summer, health benefits

నిమ్మరసంలో ఇవి కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

నిమ్మకాయ షర్బత్‌.. ఇది తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎండాకాలంలో చాలా మంది ఈ షర్బత్‌ తాగడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తారు. అయితే ఈ షర్బత్‌ రుచిగా ఉంటుందన్న మాట వాస్తవమే కానీ.. చక్కెర కలిస్తే హెల్త్‌కి మంచిది కాదన్న విషయం అందరికి తెలిసిందే. దీనికి బదులుగా అల్లం, పుదీనా, కీరదోస కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి.

నిమ్మరసం, అల్లం, పుదీనా, కీరదోస వేసిన నీరు తాగడం వల్ల బాడీ నీరసంగా అనిపించదు. నిస్సత్తువ ఆవరించదు. రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. శరీరానికి కావాలసిన పొటాషియం, పీచు, సోడియం, చక్కెర, కాల్షియం, ప్రోటీన్లు, ఐరన్‌, విటమిన్లు అందుతాయి. ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. జీర్ణప్రక్రియ మంచిగా పని చేస్తుంది. శరీరంలో చేరిన మలినాలు యూరిన్‌లో బయటకు పోతాయి. ఈ షర్బత్‌ తాగడం వల్ల ఊబకాయం రాదు. లివర్‌కి, మూత్రపిండాలకు మంచిది.

నిమ్మకాయ షర్బత్‌ చేసే విధానం

ముందుగా అల్లం, కీరదోస, నిమ్మకాయలను స్లైసులుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని రెండు లీటర్ల నీటిలో వేయాలి. కొన్ని పుదీనా ఆకులను వేసి.. రెండు గంటలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే నిమ్మకాయ షర్బత్‌ రెడీ అవుతుంది.

Next Story