మార్కెట్‌లో దొరికే పిల్లల ఆహారాలు కల్తీ అవుతున్నాయని చాలా మంది ఇంట్లోనే ఉగ్గు తయారు చేసి పిల్లలకు పెడుతున్నారు. అయితే ఉగ్గు తయారు చేసేటప్పుడు వివిధ రకాల పప్పులు ఎక్కువగా వేయడం సరికాదంటున్నారు నిపుణులు. రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు పప్పులు ఉంటే చాలాంటున్నారు. లేదంటే పిల్లలకు జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ప్రొటీన్లు ఉండే పప్పులు చిన్నారులకు ఎక్కువగా ఇవ్వడం వల్ల అజీర్తి, జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. డ్రైఫ్రూట్స్ వంటివి 8, 9 నెలల సమయంలో కొద్దిమొత్తంలో యాడ్ చేస్తే సరిపోతుందంటున్నారు. వీటితో పాటు రాగిజావ, యాపిల్, అరటిపండు వంటి వాటిని గుజ్జు చేసి పెట్టచ్చు. కాకపోతే అన్నీ ఒకేసారి కాకుండా పదిహేను రోజుల గ్యాప్ తీసుకొని పిల్లలకు అలవాటు చేయడం మంచిదని సూచిస్తున్నారు.