మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం వల్ల పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు.

By అంజి
Published on : 29 Jan 2025 11:29 AM IST

children,Stress , Life Style, mental health

మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం వల్ల పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. పిల్లలకు అవసరమైన సమయంలో పేరెంట్స్‌ అందుబాటులో ఉండకపోవడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. నిత్యం పిల్లలతో సమయం గడకపోయినా వారిని గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. వారానికోసారైనా వారితో మనసు విప్పి మాట్లాడాలంటున్నారు. వారికి స్కూల్లో ఎదురయ్యే పరిస్థితులు, ఏవైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు.

ఒక వేళ పిల్లలు చెప్పకపోయినా వారి ప్రవర్తనను బట్టి పిల్లల మనసును తెలుసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లల మానసిక, ఆరోగ్య సమస్యల లక్షణాలను అల్లరి అనే పేరుతో తోసి పుచ్చడం సరికాదు. ఆకస్మికంగా పిల్లల ప్రవర్తనలో మార్పులు, ఏ విషయంలోనూ ఏకగ్రాత చూపలేకపోవడం, కడుపునొప్పి, తల నొప్పి, అలసట వంటి శారీరక లక్షణాలు కనిపిస్తే ఇవన్నీ మానసిక సమస్యల వల్లే అని గుర్తించుకోవాలి. వారితో మాట్లాడి ఏ విధమైన ఒత్తిడీ వారిపై పడకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story