ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా?

సాధారణంగా మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువ మంది ఇంట్లో స్నానం చేయడానికి ఒకే సబ్బు వాడుతుంటారు.

By అంజి
Published on : 21 May 2025 1:30 PM IST

soap, home, Lifestyle, Health Tips, soap use

ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా?

సాధారణంగా మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువ మంది ఇంట్లో స్నానం చేయడానికి ఒకే సబ్బు వాడుతుంటారు. ఇలా ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. స్నానానికి ఉపయోగించే సబ్బుపైకి సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టరీఇయా, నోరోవైరస్‌, రోటవైరస్‌, స్టాఫ్‌ వంటి వైరస్‌లు చేరతాయి. ఒక వ్యక్తి ఉపయోగించిన సబ్బు వేరే వ్యక్తి ఉపయోగించడం వల్ల ఈ వైరస్‌లు మిగిలిన వారికి వ్యాపించే ప్రమాదం ఉంది. చర్మంపై కోతలు, గాయాలు, గీతల ద్వారా ఇవి వ్యాప్తి చెందుతాయి. దీని వల్ల చర్మ వ్యాధులు, జలుబు, ఇతర సమస్యలు కూడా వస్తాయి.

చర్మ సమస్యలు, అలర్జీలు ఉన్న వారు విడిగా సబ్బు వాడాలి. అందుకని ఇంట్లో వారందరూ ఒకే సబ్బును వాడకపోవడం మంచిది. అలాగే సబ్బు పెట్టె యూజ్‌ చేస్తున్నట్టయితే.. అందులో నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. అవకాశం ఉంటే సబ్బుకి బదులుగా లిక్విడ్‌ హ్యాండ్‌ సోప్, లిక్విడ్‌ బాడీ వాష్‌ వాడటం బెటర్‌ అని వైద్యులు చెబుతున్నారు. అలానే టవల్స్‌ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఒకరు యూజ్‌ చేసేవి మరొకరు వాడకూడదు. ఉపయోగించిన తర్వాత టవల్‌ను తప్పనిసరిగా ఎండలో ఆరబెట్టండి.

Next Story