పెరుగు తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా?.. రాత్రిపూట తినొచ్చా?

మన మానసిక స్థితిని మెరుగుపర్చడంలో పెరుగులోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రతి రోజూ భోజనంలో ఒక కప్పు పెరుగు ఉండేలా చూసుకోవాలి.

By అంజి  Published on  27 Aug 2024 1:24 PM IST
Curd, yogurt eating, yogurt, cholesterol, Lifestyle

పెరుగు తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా?.. రాత్రిపూట తినొచ్చా?

మన మానసిక స్థితిని మెరుగుపర్చడంలో పెరుగులోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రతి రోజూ భోజనంలో ఒక కప్పు పెరుగు ఉండేలా చూసుకోవాలి. అయితే పెరుగును తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగి బరువు పెరిగిపోతామన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి నిపుణులు వివరణ ఇస్తున్నారు. వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు వల్ల శరీరంలో ఎలాంటి కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు. పెరుగులోని ప్రోబయోటిక్స్‌ పేగులు కొలెస్ట్రాల్‌ను శోషించుకోకుండా అడ్డుకుంటాయి.

దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ చేరకుండా ఉంటుంది. కాబట్టి వెన్న తీసిన పాలతో చేసిన పెరుగును అధిక బరువుతో ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలతో సతమతమవుతున్న వారు కూడా తినవచ్చు. వెన్న తీయని పాలతో చేసిన పెరుగును తినడం వల్ల.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కొంత మేర పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. పెరుగును పగలు తిన్నప్పుడే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట దాని తీపి, లక్షణాల కారణంగా శరీరంలో పిత్తం, కఫం పెరుగుతాయి. ఆరోగ్యవంతులు ఇలా తింటే కొంత వరకు ఫర్వాలేదు కానీ జలుబు, దగ్గు, అలర్జీతో బాధపడేవాళ్లు రాత్రిపూట తినొద్దని సూచిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం పెరుగు తింటే సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్ల వల్ల కండరాలు బలంగా మారుతాయి.

Next Story