క్యాన్సర్ ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది. ఎప్పుడు ఎవరిలో బయటపడుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే ప్రతి రోజూ కొన్ని నిమిషాల పాటు మెట్లు ఎక్కి, దిగడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని స్వీడన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువతను ప్రతి రోజూ మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండమని సూచించారు.
ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో.. వారిలో కాలేయం, పేగు, మూత్రపిండాలు, పొట్ట, క్లోమం, గొంతు, మెడ, ఊపిరితిత్తులు, గుండె వంటి భాగాల్లో క్యాన్సర్ కణితులు పెరిగే అవకాశం చాలా తక్కువుగా ఉన్నట్టు గుర్తించారు. మెట్లు ఎక్కుతూ, దిగడం వల్ల కండరాలకు మంచి వ్యాయామం అయ్యి ఫిట్‌గా మారతాయి. లిఫ్ట్ ఉపయోగించడం కన్నా ప్రతి రోజూ మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండటం వల్ల బరువు తగ్గడంతో పాటు అధిక రక్తపోటు ముప్పు కూడా తప్పుతుంది. కండరాల దగ్గర చేరిన అధిక కొవ్వు తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.