మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం చాలా మంది మధుమేహం, అధిక బరువు, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం లభించాలంటే ప్రతి రోజూ ఒక గ్లాసు మెంతి గింజల నీటిని తాగితే మంచిది. ఒక స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే వాటిని తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా జరుగుతుంది.
మెంతి గింజల నీటిని పరగడుపున తాగితే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. మెంతి గింజల నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రనలో ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీని వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. మెంతి పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి.
మెంతుల్లో విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పి, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు మెంతి నీటిని తాగడం వల్ల తగ్గుతాయి.