మునక్కాయ తింటున్నారా?.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

ఇంట్లో సాంబార్‌, కొన్ని రకాల కూరల్లోను మునక్కాయలను వేయడం చూస్తుంటాం..అయితే ఇవి కేవలం కూరకు రుచిని మాత్రమే అందిస్తాయని చాలా మంది భావిస్తారు.

By అంజి  Published on  1 Dec 2024 7:21 AM GMT
Munakkaya, health benefits, eating, Drumsticks

మునక్కాయ తింటున్నారా?.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

ఇంట్లో సాంబార్‌, కొన్ని రకాల కూరల్లోను మునక్కాయలను వేయడం చూస్తుంటాం..అయితే ఇవి కేవలం కూరకు రుచిని మాత్రమే అందిస్తాయని చాలా మంది భావిస్తారు. అయితే ఈ మునక్కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మునక్కాయలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియ సజావుగా జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేటట్లు చేస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు తమ ఆహారంలో మునక్కాయను భాగం చేసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. ఎముకలను మేలు చేస్తాయి. దీనిలో ఉండే విటమిన్‌ - ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మునక్కాయల్లో ఉండే జింక్‌ పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడానికి తోడ్పడుతుందట. స్పెర్మ్‌ కౌంట్‌ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం మునక్కాయలను అవకాశం ఉంటే వారంలో 2, 3 సార్లు తినడం మంచిది.

Next Story