ఎండు చేప‌లు అంటే ముక్కు మూసుకుంటున్నారా..? లాభాలు తెలిస్తే అలా చేయ‌రు..!

చేపలు తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఎండు చేపలు తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించరు.

By అంజి  Published on  17 Sept 2024 1:30 PM IST
health benefits , dried fish, Lifestyle

ఎండు చేపలు తింటున్నారా?

చేపలు తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఎండు చేపలు తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించరు. వాటిని వండేటప్పుడు వచ్చే వాసన వల్ల కొందరు వాటి జోలికే పోరు. అయితే ఎండు చేపలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపలు.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతాయట. నరాల, కండరాల సమస్యలను తగ్గించి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయట.

ఎండు చేపల్లో ప్రొటీన్లతో పాటు విటమిన్‌ బి12, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండటమే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఎండు చేపల్లోని కాల్షియం, ఫాస్పరస్ వల్ల ఎముకలకు మేలు జరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉండటంతో పాటు నరాల సమస్యలను తగ్గించి కండరాల నిర్మాణానికి ఎండు చేపలు దోహదం చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇన్ని ప్రయోజనాలున్న ఎండుచేపలను అవకాశం ఉంటే ఆహారంలో భాగం చేసుకోండి.

Next Story