రక్తదానం చేస్తే ఎన్ని లాభాలుంటాయో తెలుసా?
బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఆపదలో ఉన్న వాళ్ల ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే రక్తదానం చేసేవాళ్లను ప్రాణదాతలు అంటారు.
By - అంజి |
రక్తదానం చేస్తే ఎన్ని లాభాలుంటాయో తెలుసా?
బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఆపదలో ఉన్న వాళ్ల ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే రక్తదానం చేసేవాళ్లను ప్రాణదాతలు అంటారు. అయితే.. బ్లడ్ డొనేట్ చేస్తే ఆరోగ్యం పరంగా మనకు కూడా చాలా లాభాలు ఉంటాయంటున్నారు డాక్టర్లు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మనిషి శరీరంలో ఐరన్ ఎక్కువైతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా శరీరంలో ఐరన్ పర్సంటేజీ తగ్గుతుంది. తగిన మోతాదులో మాత్రమే రక్తం తీస్తారు కాబట్టి.. శరీరంలో ఐరన్ లిమిట్‌లో ఉంటుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ నుంచి కూడా రక్షణ ఉంటుంది.
స్థూలకాయంతో బాధ పడేవాళ్లు రక్తదానం చేస్తే మంచిదంటున్నారు డాక్టర్లు. తరచుగా రక్తదానం చేస్తూ వ్యాయామం చేస్తే క్యాలరీలు త్వరగా కరిగి బరువు తగ్గవచ్చంటున్నారు. శరీరంలో అన్ని రోగాలకు స్థూలకాయం ప్రధాన కారణంగా ఉంటుంది. అలాంటి వాళ్లు బ్లడ్ డొనేట్ చేసి.. తమను తాము కాపాడుకోవచ్చు.
రక్తదానం చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనం చేసిన దానంతో ఓ జీవితం నిలబడుతుందనే ఫీలింగ్ చాలా హాయిగా ఉంటుంది. దీంతో మనలో పాజిటివ్‌నెస్ పెరుగుతుంది. అది మంచి అనుభూతిని ఇవ్వడంతో పాటు.. చేసే పనుల్లో కూడా ఉత్సాహం నింపుతుంది.
రక్తదానం చేయడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుందని, శరీరం బలహీనంగా తయారువుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇలాంటి అపోహలను నమ్మొందంటున్నారు డాక్టర్లు. బ్లడ్ డొనేట్ చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు. రక్తదానం చేసిన కొద్ది రోజుల్లోనే శరీరానికి అవసరమైన ఎర్రరక్త కణాలు మళ్లీ ఉత్పత్తి అవుతాయని చెప్తున్నారు.