బ్లాక్ టీ తాగే అలవాటు ఉందా?
ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం టీ తాగకపోతే చాలా మందికి రోజు ప్రారంభం కాదు.
By అంజి
బ్లాక్ టీ తాగే అలవాటు ఉందా?
ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం టీ తాగకపోతే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. పరగడుపున టీ లేదా కాఫీ తాగకూడదని.. ఏదైనా తిన్న తర్వాత వీటిని తీసుకోవడం అన్ని విధాల ఆరోగ్యానికి మంచిదేనని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. అయితే మామూలు 'టీ' కి బదులుగా బ్లాక్ టీని తీసుకోవడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందట. బ్లాక్ టీ అంటే టీ డికాషన్. దీన్ని రోజూ ఒకటి లేదా రెండు కప్పుల వరకు తీసుకోవచ్చు. బ్లాక్ టీని తాగడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయి పెరిగి రక్త సరఫరా మెరుగుపడి హైబీపీ ముప్పు తగ్గుతుంది.
బ్లాక్ టీలో ప్లేవనాయిడ్స్ రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించి గుండెపోటు ముప్పును తగ్గిస్తాయట. సాయంత్రం ఒక కప్పు బ్లాక్ టీ తాగితే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. బ్లాక్ టీ తాగితే స్ట్రోక్, క్యాన్సర్, డయాబెటిస్, నోటి సమస్యల ముప్పు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీ రోగ నిరోధక శక్తిని పెంచి దగ్గు, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గిస్తుందట. దంతాలు, చిగుళ్లు, నోటి ఆరోగ్యానికి బ్లాక్ టీ మంచిది. అందుకే ఇక నుంచి సాధారణ టీ లేదా కాఫీకి బదులు బ్లాక్ టీని తాగడం అలవాటు చేసుకోవడం మంచిది.