వేసవి కాలంలో తాటి ముంజలు తింటున్నారా?
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు రకరకాల జ్యూస్‌లు, శీతల పానీయాలు, మజ్జిగ, కొబ్బరి నీరు, చెరకు రసం తాగుతుంటారు.
By అంజి
వేసవి కాలం తాటి ముంజలు తింటున్నారా?
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు రకరకాల జ్యూస్‌లు, శీతల పానీయాలు, మజ్జిగ, కొబ్బరి నీరు, చెరకు రసం తాగుతుంటారు. అయితే వీటితో పాటు వేసవిలోనే మనకు లభించే తాటి ముంజలను తినడానికి చాల మంది ఆసక్తి చూపుతారు. ఇవి తింటే ఎండతాపం నుంచి ఉపశమనంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ చాలా మందికి ముంజలు దొరుకుతాయి.
పట్టణాల్లో ధర ఎక్కువైనా సరే వాటిని కొనుక్కుని చాలా మంది తింటుంటారు. అసలు ఈ తాటి ముంజలతో ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.. ముంజల్లో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, బీ, సీలతో పాటు జింక్, పొటాషియం, పాస్ఫరస్‌లు అధికంగా ఉంటాయి. వేసవిలో రోజూ తాటి ముంజలు తింటే వడదెబ్బ తగలకుండా బయటపడవచ్చు. తాటి ముంజలు వేసవి వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి బరువును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మలబద్ధకం, విరేచనాల సమస్యలకు ఇది నివారిణిగా పని చేస్తుందని చెబుతారు. డీహైడ్రేషన్‌కు గురైన వారు ముంజలు తింటే దాహం తీరి ఉపశమనం లభిస్తుంది. రక్తహీనత ఉన్న వారు ముంజలు తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎండవేడి వల్ల వచ్చే పొక్కులు, చర్మ వ్యాధులు, దద్దుర్లు తగ్గుతాయి. కాలేయ సమస్యలకు అజీర్ణ సమస్యలకు తాటి ముంజలు మంచివని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణుల జీర్ణక్రియను ముంజలు మెరుగుపరుస్తాయి. ఎసిడిటీ సమస్యను దూరం చేస్తాయి.