ఆక్సిజన్ లెవెల్స్ పెంచే ఆహార పదార్థాలు

సాధారణంగా వాయు కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడిన వారిలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

By -  అంజి
Published on : 4 Jan 2026 12:12 PM IST

foods, increase oxygen levels, Lifestyle, Health Tips

ఆక్సిజన్ లెవెల్స్ పెంచే ఆహార పదార్థాలు 

సాధారణంగా వాయు కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడిన వారిలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం కొవిడ్ కారణంగా ఎక్కువ మందిలో ఈ సమస్య కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యోగా, వ్యాయామాలు చేయడం ద్వారా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుందని పేర్కొన్నారు. వీటితో పాటు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..

1. అర‌టి పండ్లలో పీహెచ్ విలువ 4.5 నుంచి 4.7 మధ్య ఉంటుంది. ఆల్కలీన్ మోతాదు కూడా అధికంగా ఉంటుంది. ఇవి తింటే శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు తోడ్పడతాయి.

2. నిమ్మ‌కాయ‌లో ఉండే విటమిన్ సి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంతో పాటు శక్తిని ఇస్తుంది. వీటితో పాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.

3. ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి ఆక్సిజన్ స్థాయిని పెరిగేలా చేస్తాయి.

4. కీరా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఏ మాత్రం ఆమ్ల గుణాన్ని కలిగి ఉండదు. శరీరానికి చలవ చేయడంతో తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం. కీరా కూడా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంచుతుంది.

5. బ్రకోలీలో చాలా రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది.

Next Story