ఈ నట్స్ తింటే... ఆ విషయంలో మీ గట్స్ పెరగడం తథ్యం!

ప్రకృతికి మించిన నేస్తం.. ప్రాణికోటికి మరొకటి లేదు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు ప్రకృతి ప్రసాదించిన చెట్లలోనూ...

By -  అంజి
Published on : 2 Feb 2026 9:31 AM IST

eating nuts, physical performance, Almonds, cashews, walnuts, Lifestyle, Health Tips

ఈ నట్స్ తింటే... ఆ విషయంలో మీ గట్స్ పెరగడం తథ్యం! 

ప్రకృతికి మించిన నేస్తం.. ప్రాణికోటికి మరొకటి లేదు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు ప్రకృతి ప్రసాదించిన చెట్లలోనూ, కాయల్లోనూ పుష్కలంగా ఉన్నాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో వాటిని కూడా భాగం చేసుకుంటే చాలు. ఆరోగ్యంతోపాటు ఉత్సాహంగా..ఉల్లాసంగా ఉండొచ్చు. కొందరు తమ శృంగార జీవితంలో తరచూ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే మథనపడుతుంటారు. మందులు వాడితే తాత్కాలిక ఉమశమనమేకానీ..శాశ్వత పరిష్కారం లభించకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తూ ఉంటాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి.. ఆనందకరమైన జీవితాన్ని మనసొంతం చేయగలిగేవి నట్స్ (గింజ పప్పులు) అంటే మీరు నమ్ముతారా.. ఇది అక్షరాలా నిజం. ఆ నట్స్ కథా కమీషు ఏంటో తెలుసుకుందాం.

బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్‌) చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర్నుంచి ఉత్సాహం, మేధోశక్తి, మూడ్‌ పుంజుకోవటం వరకు ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. ఇవి శృంగార జీవితం మెరుగుపడటానికీ తోడ్పడుతున్నట్టు పలు అధ్యయనాల్లో బయటపడింది.

రోజుకు 60 గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటం సహా మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం గమనార్హం. తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహార అలవాట్లు గల కొందరిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరికి తమ మామూలు ఆహారం, మరికొందరికి బాదం, అక్రోట్లు, హేజెల్‌ నట్స్‌ కూడా తినమని సూచించారు. ఇలా 14 వారాలు చేసిన తర్వాత పరిశీలించగా.. గింజపప్పులు జతచేసినవారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి మెరుగుపడినట్టు తేలింది.

గింజపప్పుల్లో ప్రొటీన్‌, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడేవే. వీటిల్లో ఫాలీఫెనాల్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి స్తంభనలోపం తగ్గటానికే కాకుండా గుండె రక్తనాళ వ్యవస్థకూ మేలు చేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. మరింకెందుకు ఆలస్యం.. మొదలుపెట్టేయండి.

Next Story