సైక్లింగ్‌తో అద్భుత ప్రయోజనాలు

రోజూ యోగా, జిమ్‌ ఏం చేస్తాం లెండి.. యమ బోరింగ్‌గా ఉంటుంది. కాస్త గేరు మార్చండి. స్నేహితులతో కలిసి సైక్లింగ్ వెళ్లండి.

By అంజి  Published on  30 May 2023 11:15 AM IST
cycling, health benefits, Lifestyle, health news

సైక్లింగ్‌తో అద్భుత ప్రయోజనాలు

రోజూ యోగా, జిమ్‌ ఏం చేస్తాం లెండి.. యమ బోరింగ్‌గా ఉంటుంది. కాస్త గేరు మార్చండి. స్నేహితులతో కలిసి సైక్లింగ్ వెళ్లండి. శారీరకంగా, మానసికంగా బలంగా తయారవ్వొచ్చు. ఏ వయసు వాళ్లైనా యంగ్‌గా కనిపించాలంటే హెల్త్ మంత్రం ఇదే..

గుర్తుంచుకోవాల్సినవి: పెడలింగ్‌ చేసే సమయం చాలా కీలకం. ఒక గంట సైక్లింగ్‌ చేస్తే 500 కిలోల కేలరీలు బర్న్‌ అవుతాయి. అయితే ప్రతి వ్యక్తికీ భిన్నమైన జీవక్రియ ఉంటుందని గుర్తుంచుకోండి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి: హెల్మెట్‌ లేకుండా సైక్లింగ్ వద్దు. రెండు ఫుల్‌ వాటర్‌ బాటిల్స్‌ తప్పనిసరి. చేతికి తొడుగులు ధరించాలి. వేసవిలో నిపుణుల సూచనలు పాటించడం ఉత్తమం.

ఎంతసేపు చేయాలి?

రోజులో గంట సేపు సైక్లింగ్‌ చేస్తే 300 కేలరీలు ఖర్చవుతాయి. కనీసం 30 నిమిషాలు చేసినా చాలు. అదే వేగంగా చేస్తే రోజుకి 100 కేలరీలు ఖర్చు చేయొచ్చు.

ఏ సమయంలో చేయాలి?

కొందరు ఉదయాన్నే సైక్లింగ్ చేయడానికి ఇష్టపడతారు. మరికొందరు సాయంత్రం ఇష్టపడతారు. కానీ, ఉదయం చేసే సైక్లింగ్‌తోనే అధిక ప్రయోజనాలు ఉంటాయట.

ప్రయోజనాలు:

ఊబకాయం, బరువును నియంత్రించవచ్చు. ఎముకలు బలంగా, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. క్యాన్సర్‌ను దూరం చేయడానికి దోహదపడుతుంది.

చేయకూడనివి:

కొంత మంది త్వరగా బరువు తగ్గాలని చాలా కఠినంగా ఆహార నియమాలు పాటిస్తారు. కానీ అది మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు.

Next Story