ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల చాలా మందిలో వైరల్ ఫీవర్స్ కనిపిస్తున్నాయి. అయితే జ్వరం వచ్చినప్పుడు చాలా మంది స్నానం చేయడానికి అంతగా ఇష్టపడరు. కానీ శారీరక శుభ్రతను పాటిస్తేనే ఈ ఫీవర్స్ నుంచి ఉపశమనం పొందవచ్చని.. అందుకే వైరల్ ఫీవర్స్ సోకినప్పుడు తప్పకుండా స్నానం చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. అయితే స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్వరం వచ్చినప్పుడు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. దీంతో శరీరంలోని అలసట, నొప్పులు తగ్గుతాయి. ఇంకా బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్షెక్షన్లు దూరం అవుతాయి. అలాగని మరీ ఎక్కవ సేపు స్నానం చేయకూడదు. దీని వల్ల ప్లూ పెరిగే ప్రమాదం ఉంది. మరీ వేడినీటితో కూడా స్నానం చేయకూడదు. దీని వల్ల బీపీ తగ్గడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. జ్వరంతో బాధపడుతున్నప్పుడు చల్లని నీటితో స్నానం చేయకూడదు. దీని వల్ల చలి పెరుగుతుంది. జలుబు, ఫ్లూ లక్షణాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.