బోసుబాల్‌తో బోల్డన్ని ఉపయోగాలు

బాడీ ఫిట్‌నెస్‌ కోసం ఒక్కొక్కరు ఒక్కోరకమైన వ్యాయామం చేస్తుంటారు. అయితే వీటన్నింటి వల్ల కలిగే ప్రయోజనాల్ని ఒక్క 'బోసు బాల్‌ వ్యాయామం'తో సొంతం చేసుకోవచ్చు.

By -  అంజి
Published on : 8 Dec 2025 12:30 PM IST

Bosuball exercises, Health benefits, Lifestyle

బోసుబాల్‌తో బోల్డన్ని ఉపయోగాలు

బాడీ ఫిట్‌నెస్‌ కోసం ఒక్కొక్కరు ఒక్కోరకమైన వ్యాయామం చేస్తుంటారు. అయితే వీటన్నింటి వల్ల కలిగే ప్రయోజనాల్ని ఒక్క 'బోసు బాల్‌ వ్యాయామం'తో సొంతం చేసుకోవచ్చు. అర్ధ చంద్రాకారంలో ఉండే రబ్బర్‌ బాల్‌ ఇది. దీనిపై నిల్చొని డంబెల్స్‌ వ్యాయామాలే కాదు.. స్క్వాట్స్‌, ఫుషప్స్‌, ప్లాంక్స్‌, లాంజెస్‌, జంప్‌ స్క్వాట్స్‌.. వంటి వివిధ రకాల వ్యాయామాలు చేయవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వివిధ శరీర భాగాలక చక్కటి వ్యాయామం అంది సంపూర్ణ ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

రెండు వైపులా వినియోగించే సౌలభ్యం ఉండటంతో దీనికి బోసుబాల్‌ అనే పేరు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. తరచూ బోస్‌బాల్‌తో వర్కవుట్లు చేయడం వల్ల శరీరాన్ని బ్యాలన్స్‌ చేసుకునే శక్తి పెరుగుతుంది. ఒక్కసారి బ్యాలన్స్‌ చేయడం వచ్చాక.. సింపుల్‌ వ్యాయామాలతో మొదలుపెట్టి.. క్రమంగా వాటి తీవ్రత పెంచుకుంటూ పోవాలి. ముఖ్యంగా శరీరంలోని ప్రధాన కండర వ్యవస్థ దృఢంగా మారుతుంది.

Next Story