నల్ల పుసుపుతో ఎన్ని ప్రయోజనాలో!

Black turmeric has many health benefits. పసుపు.. ఈ భూమ్మీద అత్యంత శక్తివంతమైన మూలికల్లో ఒకటి. దీనిని సర్వగుణ సంపన్న

By అంజి  Published on  11 Jan 2023 11:00 AM GMT
నల్ల పుసుపుతో ఎన్ని ప్రయోజనాలో!

పసుపు.. ఈ భూమ్మీద అత్యంత శక్తివంతమైన మూలికల్లో ఒకటి. దీనిని సర్వగుణ సంపన్న ఔషధం అని కూడా అంటారు. భారత్‌లో దాదాపు 6 వేల సంవత్సరాల నుంచి పసుపును వంటల్లో, ఔషధంగా, సౌందర్య సాధనంగా వాడుతున్నారు. ఇది రకరకాల ఇన్ఫెక్షన్లతో పోరాడడంతో పాటు అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అయితే సాధారణ పసుపులోనే కాదు.. నల్ల పసుపులోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. ఈ పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం కర్కుమా సీసియా. మధ్యప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో నల్ల పసుపును ఎక్కువగా పండిస్తారు. ఈ పసుపు నుంచి తయారు చేసిన పేస్ట్‌ను పాము కాటు, తేలు కాటుకు మందుగా వాడతారు.

ఎన్నో ఔషధ గుణాలు

నల్ల పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మన శరీరానికి ఎంతో తోడ్పాటునిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆస్తమాటిక్, లోకోమోటర్ డిప్రెసెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ కన్వల్సెంట్, అనాల్జేసిక్, యాంటీ అల్సర్, యాంజియోలైటిక్ లాంటి లక్షణాలు నల్ల పసుపులో ఉన్నాయి.

ఊపిరితిత్తుల సమస్యకు చెక్‌..

శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి నల్ల పసుపు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దగ్గు, జలుబు, ఆస్తమా వంటి వ్యాధులను నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల పసుపును సాధారణ పసుపులానే వాడొచ్చు.

మైగ్రేన్ నుంచి రిలీఫ్

ఈ మధ్య చాలా మంది మైగ్రేన్ బారిన పడుతున్నారు. తట్టుకోలేనంత తలనొప్పి వేధిస్తుంటుంది. తల వెనుక భాగంలో, పక్క భాగంలో మరింత బాధిస్తుంటుంది. అలాంటి వారు నల్ల పసుపును ఉపయోగించి ఉపశమనం పొందొచ్చు. నల్ల పసుపును చూర్ణంలా చేసి, నుదుటిపై పేస్ట్‌లాగా రాసుకుంటే బిగ్ రిలీఫ్ కలుగుతుంది.

నెలసరి నొప్పి నుంచి విముక్తి..

చాలా మంది మహిళలకు.. నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పితో బాధపడతారు. అటువంటి పరిస్థితిలో, నల్ల పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వారికి రిలీఫ్ కలిగిస్తాయి. నల్ల పసుపు పొడి కలిపిన వేడి పాలను తాగడం వల్ల నెలసరి నొప్పి నుంచి విముక్తి పొందొచ్చు.

గ్యాస్ సమస్యలు

నల్ల పసుపులో ఉండే ఆయుర్వేద గుణాలు గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తాయి. ఆహారంలో కొంత నల్ల పసుపు వేసుకుని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, ఎక్కిళ్లు, అజీర్ణం, అల్సర్లు, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు రావు.

క్యాన్సర్‌‌కు చెక్..

నల్లపసుపులో కర్కుమిన్‌ అనే పదార్థం ఉంటుంది. దీనిలో క్యాన్సర్‌ కణాలను నిరోధించే లక్షణాలు ఉన్నాయి. నల్ల పసుపు మీ ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.

Next Story
Share it