సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా దొరికే పండ్లలో దానిమ్మ ఒకటి. ఎన్నో శక్తివంతమైన పోషకాలు కలిగిన ఫలంగా దానిమ్మను చెప్పుకోవచ్చు. దానిమ్మలో పొటాషియం, కాల్షియం, ఫైబర్‌తో పాటు విటమిన్ ఏ,బీ,సీ,కే లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటుంది. నెల రోజుల పాటు రోజుకు ఒక దానిమ్మను తింటే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మలోని పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
రక్త సరఫరా చేసే ధమనుల్లోని అడ్డంకులను తొలగించడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. దానిమ్మలో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై మడతలు, గీతలు వంటి వృద్ధ్యాప్య ఛాయలను తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. దీని వల్ల అల్జీమర్స్ ముప్పు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మను తరచుగా తీసుకుంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.