డేంజర్.. మీ బెడ్‌రూమ్‌లో వీటిని వాడుతున్నారా?
మీ బెడ్‌రూమ్‌లోని కొన్ని వస్తువులను ఎక్కువ కాలంగా ఉపయోగిస్తున్నారా? ఓ సారి ఆలోచించుకోండి. వాటి వల్ల మన ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
By అంజి
డేంజర్.. మీ బెడ్‌రూమ్‌లో వీటిని వాడుతున్నారా?
మీ బెడ్‌రూమ్‌లోని కొన్ని వస్తువులను ఎక్కువ కాలంగా ఉపయోగిస్తున్నారా? ఓ సారి ఆలోచించుకోండి. వాటి వల్ల మన ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది తల కింద పెట్టుకునే దిండ్లను కొన్నేళ్ల పాటు మార్చరు. దీనిలోకి చెమట, దుమ్ము, వివిధ రకాల అలర్జీలకు కారణం అయ్యే సూక్ష్మజీవులు చేరతాయి. వీటిని మార్చకుండా ఎక్కువ కాలం వాడితే శ్వాసకోశ సమస్యలు చర్మ వ్యాధులు, ముఖంపై మొటిమలు, డస్ట్ అలర్జీ, కళ్లు ఎర్రబడటం, దురదగా ఉండటం, నీరు కారడం వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందట. అందుకే మీరు వాడే దిండు ఒకటి లేదా రెండు సంవత్సరాలకుపైబడి ఉంటే దాన్ని వెంటనే మార్చడం మంచిది.
బెడ్ రూమ్‌లో సువాసన కోసం రూమ్ ప్రెషనర్ వాడుతుంటాం. వీటిలో సువాసన కోసం థాలేట్స్, పారాబెన్లు, ఆక్సినాల్స్, ఫార్మాలిహైడ్లు, సింథటిక్ కెమికల్స్‌ను ఎక్కువగా వాడతారట. వీటిని అతిగా వాడితే శరీరంలో హార్మోన్లు ఉత్పత్తిలో అసమతుల్యత, అలాగే స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొందరు చాలా సంవత్సరాల పాటు ఒకే పరుపును వాడుతుంటారు. దాన్ని మార్చడానికి అంతగా ఆసక్తి చూపురు. అయితే డస్ట్ మైట్స్ అనే సూక్ష్మజీవులు ఈ పాత పరుపుల్లో ఎక్కువగా చేరి డస్ట్ ఎలర్జీకి కారణం అవుతాయి. మనం పడుకునేటప్పుడు వచ్చే చెమట, ఇతర ధూళి కణాలు పరుపులో చేరుతుంది. వీటిని శుభ్రం చేయకపోవడం, ఎండలో ఉంచకపోవడం వల్ల హానికర సూక్ష్మజీవులు వాటిలో చేరి చర్మ వ్యాధులు, శ్వాస సంబంధిత సమస్యలకు కారణం అఉతాయి. అలాగే పరుపులు అరిగిపోవడం వల్ల వెన్నెముకకు సరైన సపోర్టు అందక దీర్ఘకాలిక నడుము నొప్పి, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉటుంది. అందుకే చాలా సంవత్సరాలుగా పాత పరుపులు వాడుతుంటే అవకాశాన్ని బట్టి తొందరగా మార్చడానికి ప్రయత్నించండి. బాగా ఎండగా ఉన్నప్పుడు వాటిని అప్పుడప్పుడు ఆరబెట్టడం వల్ల ఎండ తీవ్రతకు సూక్ష్మజీవులు నశించే అవకాశం ఉంది.