మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కొందరికి రాత్రి వేళ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. ఒకవేళ పట్టినా మధ్యలోనే మేల్కొంటారు. తిరిగి నిద్రలోకి జారుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ నిద్రలేమి సమస్య.. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే మంచి నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి.
పసుపు కలిపిన పాలను తాగితే చక్కని ఆరోగ్యంతో పాటు మంచి నిద్ర కూడా పడుతుంది. అందుకే నిద్రపోవడానికి ముందు ఒక గ్లాసు పాలు తాగి చూడండి. బాదంపాలలో కూడా నిద్రకు తోడ్పడే పోషకాలు ఉంటాయి. నిద్రలేమితో బాధపడుతుంటే బాదం పాలు తాగవచ్చు. చెర్రీస్‌లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. నిద్రకు ఒక గంట ముందు చెర్రీ రసం తాగితే మంచిది. నిద్రవేళకు కనీసం రెండు గంటల ముందే తేలికపాటి భోజనం చేయండి. రాత్రి వేళ వేయించిన, మసాలాతో కూడిన ఆహార పదార్థాలు, ఐస్క్రీమస్, టీ, కాఫీలను తీసుకోకపోవడం ఉత్తమం.