సంతానం కోసం ప్లాన్‌ చేస్తున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ధూమపానం, పొగాకు సంబంధిత పదార్థాలు తీసుకోవడం వల్ల అవి సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆడ, మగ ఇద్దరికీ రిస్కే.

By -  అంజి
Published on : 24 Sept 2025 11:14 AM IST

Pregnancy planning , children, precautions, Lifestyle

సంతానం కోసం ప్లాన్‌ చేస్తున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి    

ధూమపానం, పొగాకు సంబంధిత పదార్థాలు తీసుకోవడం వల్ల అవి సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆడ, మగ ఇద్దరికీ రిస్కే. అందుకే ఈ వ్యసనానికి దూరంగా ఉండాలి. అధిక బరువు కూడా సంతానలేమికి కారణం. ఇది స్త్రీలలో అండం విడుదల, హార్మోన్లపై నియంత్రణని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే తిండి విషయంలో జాగ్రత్త వహించి, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. థైరాయిడ్‌ సమస్య ఉంటే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకొని అవసరమైన మందులు వాడాలి. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి కారణంగా పిల్లలు పుట్టడం లేదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సమస్య ఉంటే తగిన ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి.

మద్యపానం సంతానోత్పత్తపై హానికర ప్రభావాన్ని చూపుతుంది. ఆల్కహాల్‌ జోలికి వెళ్లవద్దు. ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్నప్పుడు తాజా ఆహారం, ఇంట్లో వంటి వంటలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌, తాజా కూరగాయలు తీసుకోవడం ఉత్తమం. జంక్‌ ఫుడ్‌ జోలికి పోవొద్దు. రోజుకు గంటపాటు వ్యాయామం చేయాలి. వేడి ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేయడం, మొబైల్‌ ఫోన్లను ప్యాంట్‌ ప్యాకెట్‌లో ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల శరీరం వేడికి గురై వీర్య కణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మగవారిలో సంతానలేమి సమస్యకు ఒక కారణంగా మారుతోంది.

Next Story