'క్రాష్‌ డైట్‌' చేస్తున్నారా?.. అయితే జాగ్రత్తగా ఉండండి

పెళ్లిళ్లు, ఇంట్లో ఏవైనా వేడుకలు ఉన్నప్పుడు కాస్త చబ్బీగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగా బరువు తగ్గి, సన్నబడాలని...

By -  అంజి
Published on : 3 Oct 2025 1:05 PM IST

crash diet, Lifestyle, Health Tips

'క్రాష్‌ డైట్‌' చేస్తున్నారా?.. అయితే జాగ్రత్తగా ఉండండి

పెళ్లిళ్లు, ఇంట్లో ఏవైనా వేడుకలు ఉన్నప్పుడు కాస్త చబ్బీగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగా బరువు తగ్గి, సన్నబడాలని క్రాష్‌ డైట్‌ లాంటి వాటిని ఎన్నుకుంటారు. తక్కువ రోజుల్లో వేగంగా బరువు తగ్గడమే 'క్రాష్‌డైట్‌'. అయితే ఇలా అకస్మాత్తుగా, తక్కువ సమయంలోనే బరువు తగ్గిపోవడం అనేది ఆరోగ్యానికి అంతమంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటిని అనుసరించేముందు అప్రమత్తంగా ఉండకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

క్రాష్‌ డైట్‌లో అన్ని ఆహారాలను తీసుకోవడానికి వీలుండదు. కొన్నింటిని మాత్రమే తినాలనే నిబంధన ఉంటుంది. దీని వల్ల కొందరిలో పోషకాహార లోపం, కండరాలు ఒక్కసారిగా వదులుగా మారడం వంటివి జరుగుతాయి. ఆ ప్రభావం గుండెపై పడే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఏమాత్రం తేడా వచ్చినా అది హైబీపీకి దారి తీసే అవకాశం ఉంది. అందుకే 'క్రాష్‌డైట్‌' కంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గడం ఉత్తమం. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.

Next Story