నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే
పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే మట్టి, గాలి, నీరు, చెట్లు, ఆకాశం ఇవన్నీ భాగమే. ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని
By అంజి Published on 5 Jun 2023 7:00 AM ISTప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే
పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే మట్టి, గాలి, నీరు, చెట్లు, ఆకాశం ఇవన్నీ భాగమే. ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ప్రకృతిని ప్రేమిస్తూ.. రక్షిస్తూ.. ముందుకు సాగితే, అది మన భవిష్యత్ తరాలకు సాయం చేస్తుంది. లేదంటే అతివృష్టి, అనావృష్టి, భూకంపాల రూపంలో ప్రకృతి ప్రళయతాండవం చేస్తుంది.
మర్రి గింజను తనలో పొదుపుకుని మహావృక్షాన్ని అందించగల శక్తిశాలి పుడమితల్లి. ఏకకణజీవి మొదలు బుద్ధి జీవులమని విర్రవీగే మనుషుల వరకూ కోట్లాది విభిన్న జీవజాతులను కడుపున పెట్టుకుని సంరక్షించే కరుణామయి, కల్పవల్లి ధరణి. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం..
వృక్షో రక్షతి రక్షితః
పర్యావరణ పరిరక్షణ యొక్క అవశ్యకతలను అందరికీ చెప్పడం కోసం, పర్యావరణాన్ని అందరూ రక్షించాలనే స్పృహ కల్పించడం కోసం 1972 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా జూన్ 5న ప్రపంచ పర్యవరణ దినోత్సవం జరుపుతోంది. ఇందులో ఏటా దాదాపు 100కుపైగా దేశాలు పాలు పంచుకుంటున్నాయి.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం జూన్ 5, 2023 థీమ్ #BeatPlasticPollution అనే నినాదంతో ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించిన పరిష్కారాలపై దృష్టి పెడుతుంది. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం మద్దతునిస్తోంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటున్న దేశాల్లో ఇది ఒకటి.