వచ్చే ఏడాది ఇదే సమయానికి ఎలా ఉంటుందో చెప్పిన లజార్డ్ సర్వే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2020 5:39 AM GMT
వచ్చే ఏడాది ఇదే సమయానికి ఎలా ఉంటుందో చెప్పిన లజార్డ్ సర్వే

ప్రపంచంలో దేశం ఏదైనా సరే.. మొదట వినిపించే మాట కరోనా గురించే. అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ తో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1.45 కోట్ల కేసులు నమోదైతే.. భారత్ లో ఇప్పటివరకూ 10.77 లక్షల కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో 38.61 లక్షల కేసులు.. బ్రెజిల్ లో 20.76లక్షలు.. రష్యాలో 7.71 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నమోదువుతున్న కేసుల తీవ్రత చూస్తే.. వ్యాక్సిన్ వస్తే తప్పించి.. కరోనా ముప్పు ప్రపంచానికి.. ఆయా దేశాలకు తప్పని పరిస్థితి.

ఇంతకూ ఈ వైరస్ కు చెక్ పడేదెప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. అయితే.. ఈ ఏడాది చివరకు వ్యాక్సిన్ వస్తుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ ఏడాది చివరకు వ్యాక్సిన్ రాకపోతే.. పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు వచ్చే అవకాశాలు ఎంతమేర ఉన్నాయి? అన్నది మరో ప్రశ్న. ఇదిలా ఉంటే.. ఇలాంటి సందేహాల్ని మామూలు వారికి కాకుండా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మొనగాళ్లతో పాటు.. ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టే పెద్ద మనషుల్నిలాజార్డ్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.

సర్వే నివేదికలో పేర్కొన్న ముఖ్యమైన అంశాల్ని చూస్తే..

  • హెల్త్ కేర్ ఇండస్ట్రీతో పాటు.. ఆ రంగంలో పెట్టుబడులు పెట్టే అత్యధికుల అభిప్రాయం ప్రకారం వచ్చే ఏడాది ఇదే సమయానికి (జులై) మహమ్మారి కొనసాగే వీలుంది.
  • వచ్చే ఏడాది జూన్.. జులై నాటికి పెద్ద ఎత్తున వ్యాక్సిన వచ్చే అవకాశం లేదని సర్వేలో పాల్గొన్న నాలుగు వంతుల్లో మూడోవంతు మంది పేర్కొన్నారు.
  • 61 శాతం మంది పరిస్థితులు సాధారణం కావటానికి వ్యాక్సిన్ తోనే సాధ్యమన్నారు
  • అందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నోళ్లు 71 శాతం మంది
  • వ్యాక్సిన్ డీల్ 2021లోనే పుంజుకునే అవకాశం. అప్పుడు మాత్రమే సమస్య సమిసిపోయి.. ఆర్థిక రంగం కోలుకునే అవకాశం
  • కోవిడ్ తర్వాత వర్చువల్ హెల్త్ కేర్ డెలివరీ అధిక శాతం వినియోగం.. పేషెంట్లను ప్రత్యక్షంగా కాకుండా ఆన్ లైన్ లో చూసే అలవాటు అంతకంతకూ పెరుగుతోంది.
  • కరోనా ముప్పు త్వరలోనే మాయమయ్యే అవకాశం. 2021 ద్వితీయార్థం నాటికి న్యూ నార్మల్ కు చేరుకునే వీలుందని 64 శాతం మంది హెల్త్ కేర్ ఇండస్ట్రీ ప్రముఖులు స్పష్టం చేస్తుండటం గమనార్హం.

Next Story