అక్షయ్ కూమార్‌ నట విశ్వ‌రూపం చూడాలంటే.. ఈ ట్రైల‌ర్ చూడాల్సిందే.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Oct 2020 9:54 AM GMT
అక్షయ్ కూమార్‌ నట విశ్వ‌రూపం చూడాలంటే.. ఈ ట్రైల‌ర్ చూడాల్సిందే.!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'లక్ష్మీ బాంబ్‌'. రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా.. నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నారు. కాంచన సినిమాకు ఇది హిందీ రీమేక్‌. కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్, తుషార్‌ ఎంటర్‌టైన్‌ హౌజ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

దెయ్యాలు, భూతాలనేవి లేవు అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభమైంది. అక్షయ్‌ కోపంతో.. నిజంగా దెయ్యాన్ని చూసిన రోజు.. నా చేతికి గాజులు వేసుకుంటా అని అంటాడు. షాపింగ్‌ మాల్‌లో ఎర్రరంగు చీర కట్టుకుని అక్షయ్‌ మాట్లాడే తీరు అద్భుతమనే చెప్పవచ్చు. ఈ చిత్రంలో అక్షయ్‌కు, కియారాకు పెళ్లి జరుగుతుంది. దీంతో.. కాంచన కథలో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

Next Story