అదిరిపోయే ఉద్యోగం.. రెండు లక్షలు జీతం.. ఇంట్రస్ట్ ఉందా.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Oct 2020 10:44 AM GMTప్రకటన చూసి పక్కా ఆశ్చర్యపోవడం ఖాయం. మాములుగా రెండు లక్షల జీతం ఉంటుంది అంటే ఏ సాప్ట్‌వేర్ ఇంజనీరుకో లేక ఏదైనా పెద్ద సంస్థలో మేనేజరు స్థాయి ఉద్యోగికో అంత జీతం ఉంటుంది అనుకుంటాం. తాజాగా లండన్‌లోని ‘జోసఫ్ హేజ్ ఆరోన్‌సన్’ అనే న్యాయవాద సంస్థ చేసిన ఓ ఉద్యోగ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రకటన చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు.
లేఖ ప్రకారం.. మా సంస్థలోని ఓ సీనియర్ సభ్యుడి వద్ద ఓ పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్కను ఉదయం, సాయంత్రాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా రోడ్లపై షికారుకు తీసుకెళ్లాలని తెలిపింది. అంతేకాదు.. డాగ్ వాకర్‌గా చేయాలని ఇంట్రస్టు ఉన్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చునని పేర్కొంది. అంతేకాదు ఈ ఉద్యోగానికి ఇచ్చే జీతం రెండు లక్షలుగా ఆ ప్రకటనలో తెలిపింది. దీనితో పాటుగా కొన్ని నిబంధనలు కూడా పెట్టింది.
ముఖ్యంగా అభ్యర్థికి తప్పకుండా కుక్కలపై ప్రేమ ఉండాలని తెలియజేసింది. డాగ్ వాకర్ కూర్చున్న చోట, కూర్చోకుండా కుక్క వెంట లండన్ వీధులన్నీ తిరుగుతూనే ఉండాలని, ఇందుకు ఉద్యోగికి ఫిట్‌నెస్ కూడా అవసరమని షరతు విధించింది. ప్రతి శనివారం, ఆదివారం సెలవులు తీసుకోవచ్చని.. రోజూవారి పని వేళల్లో మాత్రం ఖచ్చితంగా పనిచేయాల్సిందేనని పేర్కొంది.