భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2020 5:11 AM GMT
భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 89,706 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 43,70,129కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 33,98,884 కోలుకున్నారు. 8,96,937 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 1,115 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 73,890 మంది మృత్యువాత పడ్డారు.

దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతంగా ఉండగా.. రికవరీ రేటు 1.69శాతంగా ఉంది. నిన్న ఒక్క రోజే 11,54,549 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటివరకు 5,18,04,677 పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. 65,14,231 పాజిటివ్‌ కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఇదే విధంగా కొనసాగితే.. కొద్ది రోజుల్లోనే భారత్‌ నెంబర్‌ స్థానంలో నిలవనుంది.

Next Story
Share it