భారత్‌లో 90వేలు దాటిన కరోనా మరణాలు
By తోట వంశీ కుమార్ Published on 23 Sep 2020 5:55 AM GMTభారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 83,347 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 56,46,011కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 45,87,614 మంది కోలుకున్నారు. 9,68,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 1085 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 90,020కి పెరిగింది.
Also Read
మహారాష్ట్ర: 33కు చేరిన మృతుల సంఖ్యకరోనా బాధితుల రికవరీ రేటు 81.25శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.59శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 9,53,683 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 6,62,79,462 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
Next Story