దర్జాగా భూకబ్జా.. కార్పొరేటర్ల దౌర్జన్యం..

By అంజి  Published on  4 Feb 2020 11:17 AM GMT
దర్జాగా భూకబ్జా.. కార్పొరేటర్ల దౌర్జన్యం..

హైదరాబాద్‌ నగరంలో భూ కబ్జా పడగ విప్పుకుంటోంది. భూములపై కార్పొరేటర్లు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ స్వయంగా హెచ్చరించిన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా నెరేడ్మెట్‌ 136 డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త జీ.కె హనుమంత్‌రావు, జి.కే బిల్డర్స్‌.. భూమి విషయంలో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ బాధితుడు మల్కాజ్‌గిరి కోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన కోర్టు హనుమంత్‌రావుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 4 ఎకరాల భూమిపై అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్‌ భర్త కన్నుపడింది. నాలుగెకరాల భూమిని ఆక్రమించేందుకు యత్నించిన.. అతని సిబ్బంది వర్సిటీ పాతిన బోర్డును కూడా తొలగించారు. స్థలం తనదేనంటూ తనదేనంటూ కాగితాలు సైతం సృష్టించాడు. ఆ భూమి విలువ మార్కట్‌లో సుమారు. రూ.200 కోట్లు. ఇంకే.. యూనివర్సిటీ స్థలమని తెలిసినా జేసీబీని తీసుకొచ్చి ఆ స్థలాన్ని చదును చేయించాడు. యూనివర్సిటీకి చెందిన అనేక భూములు అన్యాక్రాంతమువుతున్నా వీసీ, రిజిస్ట్రార్‌లు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.

యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే భూములన్నీ కబ్జాదారుల వశమవుతున్నాయని ఏబీవీపీ గ్రేటర్‌ కార్యదర్శి పగడిపల్లి శ్రీహరి అన్నారు. రాజకీయ నాయకులు తమ అండదండలతో వర్సిటీ భూములను ఆక్రమిస్తున్నారని ఆయన అన్నారు. తక్షణమే వర్సిటీ భూములను రీసర్వ్‌ చేసి ప్రహరీ గోడను నిర్మించాలని డిమాండ్‌ శ్రీహరి డిమాండ్‌ చేశారు. కబ్జారాయుళ్ల అధికార పార్టీ అండదండలతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాహించడం లేదని అన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్‌ మూర్తి అన్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story