కరోనా పై పోరుకు లలితా జ్యువెలర్స్ విరాళం
By తోట వంశీ కుమార్ Published on 13 May 2020 5:33 PM ISTకరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ ను విధించారు. దీంతో ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు ఉదారత చూపుతున్నారు. పీఎం, సీఎం సహాయ నిధులకు విరాళాలను అందిస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ వ్యాపార వేత్త ఏపీ సీఎం సహాయనిధికి విరాళాన్ని అందించారు. ‘డబ్బులెవరికీ ఊరికే రావు’ అంటూ వాణిజ్య ప్రకటనల్లో తరచూ కనిపించే లలితా జువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ ఉదారత చాటారు.
ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలకు తలో కోటి రూపాయల విరాళాన్ని అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.