తోటి ఉద్యోగికి బెదిరింపు లేఖ.. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌!

By Medi Samrat  Published on  11 Oct 2019 12:34 PM GMT
తోటి ఉద్యోగికి బెదిరింపు లేఖ.. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌!

హైదరాబాద్: తోటి ఉద్యోగికి బెదిరింపు లేఖ రాసిన ఉద్యోగిని కెపిహెచ్‌బీ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సోమాజిగూడలోని లలితా జ్యువెల్లరీ షాపులో ఇద్దరు ఉద్యోగులు శ్రీనివాస సత్యప్రసాద్‌, రామ్‌ గోపాల్‌ రెడ్డి కలిసి పనిచేశారు. కొద్ది రోజుల క్రితం ఒకరు కెపిహెచ్‌బీ కాలనీకి, మరొకరు తిరుపతికి బదిలీ అయ్యారు.

అయితే.. రామ్‌ గోపాల్‌రెడ్డి ఎదుగుదలను శ్రీనివాస సత్యప్రసాద్ ఓర్వలేకపోయాడు. రూ.30 లక్షలు ఇవ్వాలంటూ లేదంటే మీ పిల్లలను కిడ్నాప్‌ చేస్తానంటూ రామ్‌ గోపాల్‌రెడ్డిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. వేరు వేరు ప్రాంతాల నుంచి రామ్‌ గోపాల్‌రెడ్డి ఇంటికి రెండు లెటర్స్‌ను పోస్టు ద్వారా శ్రీనివాస సత్య ప్రసాద్‌ పంపాడు.

అలాగే.. ఎంజీబీఎస్‌ వద్ద ఓ వ్యక్తి దగ్గరి నుంచి మొబైల్ తీసుకొని బెదిరింపు మెసేజ్‌ పంపాడు. కాగా ఈ మెసేజ్‌ ఆధారంగా నిందితుడిని సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు శ్రీనివాస సత్య ప్రసాద్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Next Story
Share it