ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ తీస్ హజారీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. శిక్ష‌తో పాటు బాధితురాలికి రూ.25 లక్షలు చెల్లించాలంటూ జరిమానా వేసింది. కుల్దీప్ సెంగార్… 2017 వ సంవ‌త్స‌రం జూన్ 4న ఓ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన తీస్ హాజారీ కోర్ట్ కుల్దీప్‌ను ఇటీవల దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. అయితే.. శిక్ష ఖరారును మాత్రం వాయిదా వేసింది. తాజాగా ఇవాళ‌ తీర్పును వెల్ల‌డిస్తూ యావజ్జీవ శిక్షను ప్రకటించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.