కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, నావల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్… పాకిస్తాన్‌తో సంబంధాలున్న గూఢ చర్యం రాకెట్‌ను వెలికితీసినట్లు ఏపీ డిజిపి డి. గౌతమ్ సవాంగ్ కార్యాలయానికి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి. నేవీ సంస్థ ద్వారా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బంది, ఒక హవాలా ఆపరేటర్ పై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసినట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎనిమిది మంది శత్రుదేశ మైన పాకిస్థాన్ తో చేతులు కలిపి గూఢ చర్యం చేస్తున్నారని, మన దేశానికి సంబంధించిన సీక్రెట్లను శత్రు దేశానికి చేరవేస్తున్నారన్న అనుమానంతో వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.

దీనిపై మరింత సమాచారాన్ని సేకరించేందుకు మరికొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ ఇలా అనుమానితులుగా ఉన్నవారిని అదుపులోకి తీసుకునేందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ చర్యలు తీసుకుంటున్నారు. నేవీ, సెంట్రల్ ఏజెన్సీలతో కలిసి ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ ద్వారా గూఢచర్యం చేసే వారిని పట్టుకుని, వారిని విచారణ చేస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.

Whatsapp Image 2019 12 20 At 1.11.01 Pm

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.