కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శనం చేసుకున్న మంత్రి కేటీఆర్‌

By సుభాష్  Published on  6 Jan 2020 5:37 AM GMT
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శనం చేసుకున్న మంత్రి కేటీఆర్‌

తిరుమల తిరుపతిలో ఉత్తరద్వార దర్శనం ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కుటుంబ సమేతంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. ఇక మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావేందర్‌ రెడ్డి, దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డిలు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే వీరితోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు వేకువజాము నుంచే వీఐపీ ప్రోటాకల్‌ దర్శనం ప్రారంభమైంది. అనంతరం 3.45 గంటల నుంచి సర్వదర్శనం కోసం భక్తులకు అనుమతించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తారు.

Ktr Visits Tirumala 1

Next Story
Share it