లాక్‌డౌన్‌ను తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది: కేటీఆర్
By సుభాష్ Published on 4 May 2020 3:41 PM ISTరాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో రోడ్డు పనులను చేపట్టింది. ట్రాఫిక్ కష్టాలు తీర్చే విధంగా నాలా పనులు, రోడ్డు మరమ్మతులు, రోడ్డు విస్తరణ, సిమెంట్ రోడ్డు తదితర అభివృద్ధి పనులను చేపట్టింది. ఇక హైదరాబాద్‌లో జరుగుతున్న రోడ్డు పనులను సంబంధిత రైల్వేశాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. పలు ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి రైల్వే, రైల్వే అండర్ బ్రిడ్జిలకు సంబంధించి పనులపై, అలాగే పెండింగ్‌లో ఉన్న పనులపై చర్చించారు.
ఈ నేపథ్యంలో ఆ పనులను త్వరగా పూర్తి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సహకరించాలని మంత్రి కోరారు. జీహెచ్‌ఎంసీ రోడ్డు పనులతో పాటు హైదరాబాద్ జలమండలికి సంబంధించి కొన్ని మౌలిక వసతులకు సంబంధించి పనులు కూడా దక్షిణ మధ్య రైల్వేతో జత కూడిన ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా మంత్రి చర్చించారు.
ట్రాఫిక్ కష్టాలు తప్పే చూడాలి
రైల్వేశాఖ కూడా జీహెచ్‌ఎంసీ మాదిరి వేగంగా పనులను పూర్తి చేసి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా చూడాలని మంత్రి కోరారు. వచ్చే వర్షాకాలంలోపు ఎక్కువ చోట్ల రైల్వేకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని మంత్రి జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
తాము చేపట్టే పనులు త్వరగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు మంత్రితో తెలిపారు. ఈ సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజననన్ మాల్య, పురపాక ముఖ్య కార్యదర్శి అరవింద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌త దితరులు పాల్గొన్నారు.