విజయవాడ: కృష్ణలంకలో రిటైనింగ్‌ వాల్‌కు ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించింది. దీంతో సోమవారం సీఎం జగన్‌కు కృష్ణలంక ప్రజలు వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిధులుగా రాష్ట్ర పంచాయతీకి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పట్టణాభివృద్ధి శాఖమంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, వైఎస్ఆర్ సిపి తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి దేవినేని అవినాష్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడపా శేషు ర్యాలీలో పాల్గొన్నారు.

విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా సీఎం వైఎస్‌ జగన్‌ అభివృద్ధి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక రూ.125 కోట్ల కేటాయించారని, ఇంకా అవసరమైతే నిధులు కేటాయిస్తామన్నారు. టీడీపీ నేతల తప్పుడు మాటలు నమ్మొద్దని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పెన్షన్‌ రావడం లేదని ఎవరు ఆందోళన చెందవద్దని.. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

కృష్ణలంక ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని సీఎం జగన్‌ చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కృష్ణ లంకకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. గతంలో రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కృష్ణలంక రైటైనింగ్‌ వాల్‌కు నిధులు కేటాయించారని.. మళ్లీ ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.125 కోట్లు కేటాయించారని తెలిపారు. కృష్ణలంకలో రిటైనింగ్‌ నిర్మించడం వలన ఆరు వార్డుల ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించే వ్యక్తి సీఎం జగన్‌ అని మంత్రి బొత్స అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసిన సీఎం జగన్‌కు ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు. ఇంటింటికి పెన్షన్‌ అందజేస్తామని, అమ్మ ఓడి ద్వారా రూ.15 వేలు అమ్మల అకౌంట్ల వేశారన్నారు.

వరదల వలన కృష్ణలంకలో రిటైనింగ్‌ వాల్‌ లేకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నేత దేవినేని అవినాష్‌ అన్నారు. పెన్షన్‌లు తొలగిస్తున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ సీఎం చేయని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని దేవినేని అవినాష్‌ అన్నారు.

అంజి

Next Story