బుధవారం కృష్ణా బోర్డు భేటీ కానుంది. కృష్ణా బేసిన్‌లో మిగులు జలాలను తెలుగు రాష్ట్రాలు ఎలా వినియోగించుకోవాలో ఈ బోర్డు తేల్చనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో హైదరాబాద్‌, విజవాడ, ఢిల్లీ నుంచి కమిటీ సభ్యులు పాల్గొంటారు. కమిటీ చైర్మన్‌గా కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్‌ వ్యవహరించున్నారు. సభ్యులుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అంతరాష్ట్ర సీఈలు, సీడబ్ల్యూ హైడ్రాలజీ విభాగం డైరెక్టర్‌, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఉన్నారు.

అయితే కృష్ణా బేసిన్‌లో నికర జలాల్లో ఏపీ, తెలంగాణ కలిపి 811 టీఎంసీలను కేటాయించగా, ఇందులో తెలంగాణలో 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన సమయంలో వచ్చే వరద కృష్ణా బేసిన్‌లో 811 టీఎంసీల నికర జలాల కంటే ఎక్కువ నీరు అందుబాటులో ఉంటుంది. దీనినే మిగులు జలాలుగా పేర్కొంటారు. అయితే ఈ మిగులు జలాలు ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలో ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. దీంతో ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ తొలి సమావేశం బుధవారం జరగనుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *